ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లక్ష్మణ్
హైదరాబాద్,మే4(జనంసాక్షి): బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నిమ్స్ నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై ఏప్రిల్ 29 వ తేదీన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ నిరాహార దీక్షకు దిగడంతో.. పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లోనే లక్ష్మణ్ అయిదు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తూ.. అస్వస్థతకు గురయ్యారు. లక్ష్మణ్‌ను కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్ పరామర్శించి.. లక్ష్మణ్ చేత దీక్షను విరమింపజేశారు. శనివారం ఉదయం నిమ్స్ నుండి లక్ష్మణ్ డిశ్చార్జ్ అయ్యారు.