ఆ ఇద్దరు బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతులు నోముల,గుండెబోయినలకు నివాళి

 

 

 

 

 

 

 

 

నల్లగొండ,డిసెంబర్‌1 (జనంసాక్షి):  పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌. వారి ఆశయ సాధన కోసం మనమంతా పాటుపడాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామంలోని స్మృతి వనంలో వారి విగ్రహాలు ఆవిష్కరణ చేయటం వారికిచ్చే ఘన నివాళి అని అన్నారు. విగ్రహాల ఏర్పాటుతో ఆ మహనీయులిద్దరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన సంతాపం వ్యక్తం చేశారు.