ఆ నద్నాలుగు గంటలు…
న్యూఢిల్లీ: ఓపక్క ప్రాణ భయం… మరోపక్క కళ్లముందే పలువురి ప్రాణలు పోతోంటే నిస్సహాయతతో కూడిన ఆగ్రహం… తాజ్ హోటల్లో మేనేజ్‌మెంట్ ట్రెయినీగా అంకూర్ చావ్లా పద్నాలుగు గంటల పాటు అనుభవించిన మన:స్థితిని పదాల్లో పెట్టడం కష్టమే. కానీ పెట్టి చూపాడు అంకుర్. 2008 నవంబరులో ముంబాయి తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు కాపాడుకోవడం, హోటల్ సిబ్బందిగా అతిథుల ప్రాణాలు కాపాడడం… ఈ రెండు విధుల మధ్య 14 గంటల పాటు తాను పడ్డ మానసిక వేదనకి అక్షరరూపం ఇచ్చాడు అంకుర్. ’14 అవర్స్ – యాన్ ఇన్‌సైడర్స్ అకౌంట్ ఆఫ్ ది 26/11 తాజ్ అటాక్’ పేరుతో ఆ పుస్తకం నిన్న విడుదలైంది.నవంబరు 26కి ముందే కసబ్‌ను ఉరి తీయడం తనకు కాస్త తృప్తిపిచ్చిందని అంకుర్ అంటున్నాడు. దాడులనుంచి సురక్షితంగా బయటపడ్డ మరికొందరి కథనాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.