ఆ మిలిటెంట్‌ పాకిస్తానీయుడే

5

– సభలో రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి):

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనపై గురువారం కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొక తీవ్రవాది పట్టుబడ్డారు. అలాగే ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బుధవారం  ఉదంపూర్‌ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు… దాడుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, మరో 14మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాది తన పేరు మహమ్మద్‌ నావెద్‌ అలియాస్‌ ఉస్మాన్‌గా చెప్పాడని రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నుంచి వచ్చినట్లు ఉగ్రవాది చెప్పాడని తెలిపారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే 47లు, గ్రేనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఉగ్రవాదిని పట్టుకోవటంలో సహకరించిన గ్రామస్థులకు ¬ం మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది పాకిస్తానీయుడే అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఉగ్రవాదిని స్థానికులు పట్టుకోవడం సాహసోతపేత చర్య అని, వారిని పట్టుకున్నందుకు గ్రామస్థులకు రాజ్‌నాథ్‌ ధన్యవాదాలు తెలిపారు. పట్టుబడ్డ ఉగ్రవాదిని పోలీసులు విచారిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

తాజావార్తలు