ఆ ముగ్గురి దర్శకత్వంలో నటించాలనిఉంది

మనసులో మాట బయటపెట్టిన మహానటి


వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు తన నటనతో జీవం పోసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి కీర్తీసురేష్‌. ’నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ’మహానటి’ చిత్రంతో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ’మహానటి’ విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తీ కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఎª`లాప్‌లుగా నిలిచాయి. చాలా కాలం తర్వాత సాని కాదియం సర్కారు వారి పాటతో వరుసగా రెండు హిట్లను సాధించింది. తాజాగా కీర్తి ఓ ఇంటర్వూలో భాగంగా తన ఇష్టాలని పంచుకుంది. కీర్తికి విజయ్‌ సేతుపతి నటనంటే చాలా ఇష్టమని తెలిపింది. కార్తీ, జయంరవి లాంటి నటులతో పనిచేయాలనుందని మనసులో మాటను బయటపెట్టింది. అంతేకాకుండా రాజమౌళి, మణిరత్నం, శంకర్‌ దర్శకత్వంలో నటించాలని ఉందని తెలిపింది. బరువుతగ్గడంపై స్పందించి.. మహానటి తర్వాత ఏడు నెలలు ఇంట్లోనే ఉన్నానని, ఆ సమయంలో కసరత్తులతో పాటు ఆహారపు కట్టుబాట్లు పాటించానని తెలిపింది. ఇక రెమ్యునరేషన్‌ తెలుగు, తమిళంలో ఒకే విధంగా తీసుకుంటున్నట్లు వెల్లడిరచింది. ప్రస్తుతం ఈమె మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ’మామన్నన్‌’ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో ఫాహద్‌ ఫాజిల్‌ ప్రాధాన పాత్రలో నటిస్తున్నాడు. దీనితో పాటుగా తెలుగులో నానితో ’దసరా’, చిరుతో ’భోళా శంకర్‌’ సినిమాలో నటిస్తుంది.