ఆ ముగ్గురు, ఓ బాలిక
ఒక స్వచ్ఛంద సంస్థ …
రుద్రుర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కోటగిరి లింగవ్వ మనవరాలు సాత్విక తల్లితండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో ఆ అమ్మాయి స్థితికి చలించిన రుద్రూర్ నివాసులు కోడె శంకర్ మాజీ విండో ఛైర్మన్ పత్తి రాము , మొద్దుల నర్సయ్య ఆ అమ్మాయి కి సహాయం చేయాలని తలచి వారికి తెలిసిన బోధన్ పట్టణానికి చెందిన గైస్ ఫర్ గుడ్ డీడ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సంపత్ కుమార్ గౌడికి స్వాతిక వివరాలు తెలిపి గత ఏడు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి కి చదుకోవడానికి కావాల్సిన చేయూతను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే మరోసారి రుద్రుర్ మండల కేంద్రనికి గురువారం విచ్చేసి స్వాతిక కు గైస్ ఫర్ గుడ్ డీడ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సంపత్ కుమార్ గౌడ్ నిత్యవసర సరుకులతో పాటు నగదు కూడా అందించారు. ఇలా తన సంస్థ పేద విద్యార్థుల కోసం, అనాధ విద్యార్థుల కోసం, చదువుకునే పేద విద్యార్థులకు ఎప్పుడు చేయూతను అందిస్తుందని సంస్థ వ్యవస్థాపకులు సంపత్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు బుక్స్ ,ప్యాడ్స్ వంటివి ఈ ప్రాంతంలో అందించామన్నారు. పై చదువులు చదివే పేద విద్యార్థుల కోసం కూడా మెటీరియల్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కోడే శంకర్ యాదవ్, హన్మండ్లు శివకుమార్, కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.