ఇంకుడు గుంతల అవగాహణ సదస్సు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు నగర మేయర్‌ జాగ్రత్త చర్యలు ప్రకటించారు. ఇవాళ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన  ఇంకుడు గుంతల అవగాహనా సదస్సు మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌, డిప్యూటీ మేయర్‌ రాజ్‌కుమార్‌లు   పాల్గొని  మాట్లాడారు. జంట నగరాల్లో ఈ ఏడాది పదివేల ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందు కోసం రూ.6 కోట్లు కేటాయించామని తెలిపారు. తమ ప్రయత్నానికి ప్రజలు సహకరించాలని తయన విజ్ఞప్తి చేశారు.  ఇంకుడు గుంతల విషయంలో ఏమైనా అనుమానాలు, అపోహలుంటే అధికారుల్ని సంప్రతించాలని ఆయన కోరారు.