ఇంకుడు గుంతల పట్ల అవగాహనా కార్యక్రమం యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి

ఇంకుడు గుంతల వల్ల చాలా ప్రయోజనాలున్నాయని జిల్లా పమేలా సత్పతి  అన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ  యాదగిరిగుట్ట మండలం లోని చొల్లేరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు అవగాహన కల్పించుట, మురికి నీరు  నిల్వ ఉండకుండా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తూ , ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి వద్ద గల స్థలంలోనే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే గ్రామంలో మురుగు నీరు ఒక చోట చేరకుండా ఎక్కడికక్కడ ఇంకిపోతుందని , ఇది గ్రామానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ముందుకు రావాలని, స్వచ్ఛ శనివారం కార్యక్రమం లో భాగంగా ప్రజలు ప్లాస్టిక్ వినియోగించడం తగ్గించేందుకు ప్రజలలో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు క్లాత్ బ్యాగ్స్ వినియోగాని అలవాటు చేసుకోవాలని ఇంట్లో వాడిన ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ఉత్పత్తులు తడి చెత్తలో కలపకుండా ఇంటి స్థాయిలోనే తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయితివారికి అందించినట్లయితే తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం అవుతుందని దీనికోసం ప్రజలు తమ వంతు బాద్యతగా కృషి చేయాలనీ కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, మండల పరిషత్ అధ్యక్షులు చీర శ్రీశైలం, జడ్పీటీసి  టి .అనురాధ, సర్పంచ్ టి.బీరయ్య ,ఎంపీటీసీ అరుణ, ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, తహశీల్ధార్ రాములు నాయక్, ఎంపీవో   చంద్ర శేఖర్ , గ్రామ ప్రత్యేక అధికారి, పంచాయితీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.