ఇంకెన్నాళ్లీ మతరాజకీయాలు?
` భాజపాకి కులం, మతం పేరుతో పబ్బగడుపుకోవడం తప్ప అభివృద్ధి పట్టదు
` వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా?
` రాష్టాన్రికి ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలి
` ఊకదంపుడు ఉపన్యాసాలు మానాలి
` టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి):భాజపా నేతలు ఇంకెన్నాళ్లు రజాకార్ల గురించి మాట్లాడతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. వాళ్లు మతం గురించి తప్ప.. అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భాజపా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘’భాజపా పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? కులం, మతం పేరుతో రాజకీయాలు తప్ప.. భాజపాకి అభివృద్ధి పట్టదు. మతం పేరుతో చేసే రాజకీయాలకు కాలం చెల్లింది. మూసీ పునరుజ్జీవం విషయంలో భాజపాకి స్పష్టత లేదు. భాజపా నేతలకు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలనే సోయి లేదు. మెట్రో విస్తీర్ణంలో హైదరాబాద్ రెండో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రో రెండో దశకు కేంద్రం అనుమతి, నిధులు తీసుకురావాలనే ఆలోచన లేదు’’అని మహేశ్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ,బీఆర్‌ఎస్ నాటకాలాడుతన్నాయని టీపీసీసీ చీఫ్ మహేప్‌ా కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ తో కలిసి కిషన్ రెడ్డి లాలూచీ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పొద్దున లేస్తే కులాలు ,మతాలు పంచాయతీ పెట్టేప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి కాదు కిస్మత్ రెడ్డి. కష్టం లేకుండా గెలుస్తున్నారని అన్నారు. విూడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. పొద్దున లేస్తే కిషన్ రెడ్డి ముస్లిమ్ జపం చేస్తడు. అక్బరుద్దిన్ ఒవైసీ విూదనే కిషన్ రెడ్డి రాజకీయం చేస్తడు. పోయిన జన్మలో ఒవైసీ, కిషన్ రెడ్డి బ్రదర్స్ అయి ఉంటారని అన్నారు. చెప్పుతో ఎవరిని కొడతారు కిషన్ రెడ్డి. నువ్ మగాడివి అయితే 10 ఏండ్లలో నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చకు రా అంటూ సవాల్ చేశారు. దిగజారుడు భాష రాజకీయాల్లో మంచిది కాదు. 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు,ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండీ రాష్టాన్ర్రికి ఏం తెచ్చారని నిలదీసారు.. కిషన్ రెడ్డికి మతం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదు. రాష్ట్ర అభివృద్ధిపై కిషన్ రెడ్డి, సంజయ్ ..ఎంపీలతో ఏనాడైనా మాట్లాడారా.పనికిరాని వాళ్లు ఏఐ పోస్టులు పెడితే కిషన్ రెడ్డి వాటిని కాపీ కొడతాడు. బండి సంజయ్ ఎపుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. సన్నబియ్యం కేంద్రానివి అంటడు. మరి బీజేపీపాలిత రాష్టాల్ల్రో ఎందుకివ్వట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.