ఇంచార్జీ సర్పంచ్ గా ఎస్సీ లనే నియమించాలి

*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య .
చిట్యాల2(జనంసాక్షి) చిట్యాల గ్రామ పంచాయతీకి ఇంచార్జ్ సర్పంచ్ గా ఎస్సీ కులస్తుడినే నియమించాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య జిల్లా కలెక్టరును కోరారు.శనివారం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు బొడ్డు ప్రభాకర్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మల్లయ్య మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో చిట్యాల గ్రామ పంచాయతీకి ఎస్సీలకు రిజర్వేషన్ అవకాశం రాగా కీర్తిశేషులు డాక్టర్ మాసు రాజయ్య ఎన్నికై అనంతరం మరణించగా ఇతర కులస్తుడిని నియమించగా పలు ఆరోపణలపై పూర్న చందర్ రావును తొలగించారని, ప్రస్తుతం సర్పంచ్ పదవి ఖాళీగా ఉన్నదని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ లకు అవకాశం ఇంచార్జీ సర్పంచ్ గా ఎస్సీ లనే నియమించాలని, గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇంచార్జీ సర్పంచ్ పదవిని ఎస్సీ కులానికి చెందిన వారిని నియమించాలని లేదా ఉప ఎన్నిక నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్, మండల అధ్యక్షులు బొడ్డు ప్రభాకర్, సరిగొమ్ముల రాజేందర్, గుర్రం తిరుపతి, గురుకుంట్ల కిరణ్, గుర్రం రాజమౌళి, అల్లకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.