ఇంజినీరింగ్‌ విద్యార్థి అరెస్టు

హైదరాబాద్‌: ప్రధాని కార్యాలయం పేరుతో మోసానికి పాల్పడిన ఇంజినీరింగ్‌ విద్యార్థి అక్తర్‌ను అరెస్టు చేశారు. పీఎంఓ పేరిట మోసానికి పాల్పడ్డాడంటూ అక్తర్‌పై ఢిల్లీలో సీబీఐ కేసు నమోదు చేసింది. లక్నో వర్సిటీలో ఎం.ఎన్‌. సీటు కోసం పీఎంఓ పేరుతో ఫోర్జరీ లేఖ రాసినట్లు అక్తర్‌పై ఆరోపణలున్నాయి.