ఇంటర్నేషనల్ 320ఎఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిరుప సతీష్ కు ఉత్తమ టీచర్ అవార్డు
ములుగు బ్యూరో,సెప్టెంబర్19(జనం సాక్షి):-
ములుగు జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు అయినా శిరూప సతీష్ ను ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ టీచర్ గా ఎంపిక చేసి ఇంటర్నేషనల్ 320 లయన్స్ క్లబ్ నిర్వహించిన గురుపూజోత్సవం లో ఉత్తమ టీచర్ గా అవార్డు అందుకున్నారు. ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చుంచు రమేష్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సిరుప సతీష్ చేసిన సేవలకు మరియు ఆన్లైన్ తరగతుల సమయంలో ప్రతీ ఒక్క విద్యార్థి వర్క్ షీట్ లు మరియు వెబ్ నార్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధనకు గాను మరియు ఉపాధ్యాయ వృత్తి పట్ల తనకు ఉన్న అంకితభావంను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. శిరుప సతీష్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ 320ఎఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు నా యొక్క సేవలను గుర్తించి అవార్డు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు మరియు ఈ అవార్డు నా యొక్క బాధ్యత పెంచినది అని అన్నారు
ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు,ఎస్టియు ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ళ మధుసూదన్,శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail