ఇంటర్మీడియట్ సిబ్బందికి 11 నుంచి బదిలీలు
కరీంనగర్ ఎడ్యూకేషన్, జనంసాక్షి : ఇంటర్మీడియట్ విద్యలో పనిచేసే బోధనేతర సిబ్బందికి బదిలీల కౌన్సిలింగ్ ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా వృత్తి విద్యాధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై అతికించినట్లు పేర్కొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసే బోధనా, బోధనేతర సిబ్బంది షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని కోరారు.