ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు నాలుగో రోజు 100% విద్యార్థులు హాజరు.
కోటగిరి మార్చి 18 జనం సాక్షి:-ఇంటర్ పరీక్షలో భాగంగా శనివారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు చీఫ్ సూపర్డెంట్ రిజ్వాన సమీరా,పరీక్షల ప్రత్యేక అధికారి ఎం.గంగాధ ర్ ఒక ప్రకటనలో తెలిపారు.కోటగిరి పరీక్ష కేంద్రంలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఇంగ్లీష్ పరీక్షకు 100% అభ్యర్థులు హాజరైనట్లు వారు తెలిపారు.మొత్తం 184 మంది విద్యార్థులకు గాను 184 విద్యార్థులు హాజరైనారని వారు తెలిపారు.