ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌ కాపీయింగ్‌

నల్గొండ : ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్టవి జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి విద్వాన్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షా కేంద్రంలో కెమెరాలను చూడగానే అధ్యాపకులు పరుగు పెట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.