ఇంటర్ కాలేజీ లో ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు
ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల ప్రచారం తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ జహీరాబాద్ ఏరియా వ్యాప్తంగా ప్రైవేటు కళాశాల యజమాన్యాలు పరీక్ష ఫీజు పేరుతో ఒక్కో విద్యార్థి దగ్గర 800 నుండి 1900 వరకు అక్రమ ఫీజులకు పాల్పడుతున్నారు అన్నారు. విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు అన్నారు. అడ్మిషన్ కాకముందు ఒకరకంగా చెప్తూ అడ్మిషన్ అయిన తర్వాత ఫీజుల పేరుతో వేధించడం సరికాదని అన్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకొని అధిక ఫీజులకు పాల్పడుతున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు లేనియెడల ఉద్యమాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో
నాయకులు మల్లేష్ హరీష్ క్రాంతికుమార్ కార్తీక్ తదితరులు ఉన్నారు.