*ఇంటర్ ఫలితాల్లో విజయ కేతనం ఏగరవేసిన ప్రభుత్వ కళాశాల*
దేవరుప్పుల,జూన్ 28 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన
ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 85.6 శాతం సాధించగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 76 శాతం ఉత్తీర్ణత సాధించారని
విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు.ఈ సందర్భంగా టాపర్లను కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం అభినందించింది.ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఈ ఫలితాలు రుజువు చేశాయని కొనియాడారు.