ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ కౌన్సిలింగ్: ప్రిన్సిపాల్ హరి సింగ్.
బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ గ్రామంలో
టి.టి.యం.ఆర్.జెసి (బాలుర) కృష్ణసాగర్ కళాశాలలో మొదటి సంవత్సరం మిగిలిన సీట్లు కోరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపాల్ హరి సింగ్ తెలియజేశారు. మొదటి సంవత్సరం ఇంటర్ మీడియట్ లో మిగిలిన సీట్లు కొరకు 29.08.2022 సోమవారం వై టి సి బిల్డింగ్ ఇల్లందు నందు స్పాట్ కౌన్సిలింగ్ కలదని తెలియజేశారు. సీట్లు కావలసిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ 2 జతలు జీరాక్స్ కాపీలు, 4 ఫోటోలతో10 గంటలకు హాజరు కావాలని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ టి. హరి సింగ్ కోరారు.