*ఇంటింటికీ ఉచితంగా బోదకాలు వ్యాధి నిరోధక మాత్రలు ఎమ్మెల్యే*
కోదాడ అక్టోబర్ 20(జనం సాక్షి )
ప్రజల ఆరోగ్య రక్ష అనే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోదకాలు నివారణ వారోత్సవాల సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోదకాలు నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాలకు భరోసా వచ్చిందన్నారు. గ్రామాల నుండి పట్టణాలకు వరకు ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందని ద్రాక్షగా ఉన్నా కార్పొరేట్ వైద్యం ముఖ్యమంత్రి సహాయ నిధి తో నేడు పేదల చెంతకు చేరిందన్నారు. బోదకాలు రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలన్నారు. వైద్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఉచితంగా డీఈసీ మాత్రలు పంపిణీ చేస్తుందన్నారు. ఆరోగ్య శాఖ ద్వారా అందించే సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దోమల కారణంగానే బోదకాలు వ్యాధి వ్యాప్తి చెందుతుందని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని దోమలను నివారించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలజ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు, నాయకులు ఈదుల కృష్ణయ్య, బెజవాడ శ్రవణ్, చల్లా ప్రకాష్, మౌలానా, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Attachments area