ఇంటిపై దాడి చేసిన పార్టీ పట్టించుకోవడం లేదు..!
అందుకే బిఆర్ఎస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నా
– విలేకరుల సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ అనవేన వేణు
జనంసాక్షి , కమాన్ పూర్ : తన ఇంటిపై తమ పార్టీకి చెందిన నాయకుని కొడుకే దాడి చేశాడని, ఈ విషయాన్ని పార్టీ ముఖ్య నాయకుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడం లేదని, తనను అవమానించిన భరించానని, కానీ తమ ఇంటి పైకి వచ్చి తమ కుటుంబ సభ్యులపై దాడికి యత్నించడాన్ని భరించలేనని అందుకే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కమాన్ పూర్ ఏఎంసి డైరెక్టర్, పెంచికల్ పేట గ్రామానికి చెందిన నాయకుడు అనవేన వేణు తెలిపారు. సోమవారం కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కమిటీ డైరెక్టర్ పెంచికలపేట గ్రామానికి చెందిన అనావేన వేణు స్పష్టం చేశారు. సోమవారం కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… బిఆర్ స్ పార్టీవారు తమ ఇంటిపై దాడి చేసి కొట్టిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు కు స్థానిక బిఆర్ స్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి విన్నవించిన ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. పుట్ట మధు బీసీలు బీసీలు అంటూనే బీసీల పైన దాడి చేసిన పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై బిఆర్ఎస్ పార్టీకి, ఏఎంసి డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తమకు విలువ ఇవ్వని పార్టీలో ఇక ఉండలేనని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతానాన్ని అన్నారు. ఆయనతో పాటు అనవేన మల్లేష్ గడ్డం నాగేష్ సైతం బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.