ఇంటి తాళాలు ఇతరులకు ఇస్తే ప్రమాదం 

మారు తాళాలతో ఎప్పుడైన దొంగతనం జరిగే ప్రమాదం
– అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌9  ఇంటికి తాళం వేసి బయటికి వెళ్తూ ఇంటి తాళాన్ని పొరుగువాళ్లకో, తెలిసినవాళ్లకో ఇస్తుంటే ..జాగ్రత్త అని పోలీసులు హెచ్చరించారు.  విూ ఇంటి తాళాలకు డూప్లికేట్స్‌ తయారు చేసుకుని, తరువాత దొంగతనాలు చేసే అవకాశాన్ని విూకు విూరే వేరే వాళ్లకు క్షలపంచవద్దని సైబరాబాద్‌ కైమ్స్ర్‌ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ అన్నారు. ఇంటి తాళాలకు డూప్లికేట్‌ చేసుకుని, ఆ ఇంటివారు ఇంటి వారు ఇంట్లో లేని సమయం చూసుకొని.. డూప్లికేట్‌  తాళాలతో ఇంట్లోకి ప్రవేశించి నగలు, డబ్బు, విలువైన పత్రాలు తస్కరించే అవకాశాలు ఉన్నాయని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సాధ్యమైనంత వరకూ ఇరుగుపొరుగు వారికి, బంధుమిత్రులకు ఇంటి తాళాలు ఇచ్చే అలవాటు  ఉంటే వెంటనే మానుకోవడం మంచిదన్నారు. తాళాలు అందరికీ కనిపించేటట్టుగా అందుబాటులో ఉంచకూడదు.
ఇంట్లోకి వెళ్ళగానే ప్రవేశద్వారం వద్ద తాళాలను వేలాడదీస్తారు. ఇది అంత మంచిది కాదు. ఇలా చేయడం అంత శ్రేయస్కరం కాదన్నారు.  దొంగలు మార్కెటింగ్‌, ప్రోడక్ట్‌ ప్రమోషన్‌, వాటర్‌ తదితర అవసరాల కోసం ఇంటికి వచ్చినట్టు గా నటించి.. మిమ్మల్ని మాటల్లో ఉంచి తాగునీరు అడుగుతారు. ఎవరూ గమనించని సమయం చూసి ఇంటి తాళం చెవిని డూప్లికేషన్‌ చేసే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటిలో ఉపయోగించుకోవడం ఉత్తమం అని సూచించారు.  ¬మ్‌ సెక్యూరిటీ సిస్టం ద్వారా విూ మొబైల్‌ నుంచి ఇంటిని లైవ్‌ గా చూడవచ్చు. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి లు షాయోవిూ వంటి కంపెనీలు తక్కువ ధరకే ఆ/-లనైన్‌/ మార్కెట్‌ లో అందుబాటులో ఉన్నాయి. ¬మ్‌ సెక్యూరిటీ సర్వైలెన్స్‌ కు ఇవే ఎంతో ఉపయుక్తం అన్నారు. స్పేర్‌ కీస్‌ ను ఇతరులకు ఇవ్వకపోవడమే మంచిది. విూ ఇంటి మెయిన్‌ డోర్‌ కు సాంప్రదాయ తాళం గుత్తి కి బదులు హై ఎండ్‌ గోద్రెజ్‌ హై సెక్యూరిటీ లాక్‌ సిస్టం ని వాడడం మంచిది.  విూ ఇంటి ప్రధాన ద్వారానికి పీప్‌ ¬ల్‌ డోర్‌ లైన్స్‌ ను ఉపయోగించండి.
ఇంటికి తాళం తో పాటు దృఢమైన,  నాణ్యమైన తలుపులను వాడాలని అన్నారు. సొంత ఇల్లు అయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్‌ అమర్చుకోవడం మంచిదన్నారు. ఇంట్లో, ఇంటి బయట మోషన్‌ సెన్సర్‌ లను ఉపయోగించడం మంచిది.  ఇంటి బయట మోషన్‌ సెన్సర్‌ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. సెంసార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్‌ వెలుగుతుంది. సెక్యూరిటీ అలారం సిస్టమ్స్‌ ఇవ్వడం ఉత్తమం.  సీసీటీవీ లను ఏర్పాటు చేసుకోవాలి.
ఏదేని పోలీసుల సహాయం కోసం 100 డయల్‌ చేయగలరు లేదా సైబరాబాద్‌ పోలీసుల వాట్సాప్‌ నంబర్‌ 9490617444 నంబర్‌ కు మెసేజ్‌ చేయవచ్చన్నారు.  చిన్న సూచనలు పాటించి మనల్ని, మన కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.