ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ పై అవగాహన
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ పై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ రిక్రూటింగ్ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సజ్జా శ్రీ చైతన్య మాట్లాడుతూ ఐఏఎఫ్ అగ్నివీర్ నియామక ప్రక్రియ, వయోపరిమితి, అర్హతలు , శారీరక కొలతలు, పరీక్షా విధానం, శిక్షణ,వేతనాలు ఇతర సౌకర్యాల గురించి విద్యార్థులకు వివరించారు.సంవత్సరంలో రెండు సార్లు నియామకాల కొరకు నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు.తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరారు.ఇంటర్ విద్యార్హతతో చిన్న వయసులోనే స్థిరపడవచ్చని అన్నారు. ఉద్యోగం చేస్తూ కూడా దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించవచ్చునని తెలిపారు.ఉద్యోగంతో పాటు దేశానికి సేవ చేసే అవకాశం ఉందన్నారు.ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ కే రాజేష్ , నాన్ కమిషన్డ్ ఆఫీసర్ జీవన్ సింగ్ , యూత్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఇంచార్జ్ వెంకట్ రెడ్డి , కళాశాల వైస్ ప్రిన్సిపల్ మద్దే మడుగు సైదులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చీకూరి కృష్ణ , లింగం , కవిత ,నాగలక్ష్మి , నిరంజన్ రెడ్డి , వీరయ్య , బాల్తు శ్రీనివాస్, గుండగాని శ్రీనివాస్ , వెంకన్న , నవీన్ కుమార్, రమేష్ , కంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.