ఇండెన్ గ్యాస్ వినియోగదారులకు అవగాహన సదస్సు
గ్యాస్ వినియోగించేటప్పుడు మహిళలు సెల్ ఫోన్ వాడరాదు
రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : మందమర్రి ఏరియా రామకృష్ణ పూర్ సూపర్ బజార్లో ఇండేన్ గ్యాస్ వినియోగదారుల అవగాహన సదస్సును మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మన నిత్య జీవితంలో ప్రతి రోజూ మనకు ఎంతో అవసరమయ్యే గ్యాస్ వినియోగ అవగాహణపై ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి గృహిణి కూడా వంట చేసేటప్పుడు గ్యాస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు
పాటించాలన్నారు. ప్రతి గృహానికి కూడా గ్యాస్ పై అవగాహన ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. వంట చేసేటప్పుడు సెల్ఫోన్ ఉపయోగిస్తూ వంట చేయరాదని, సెల్ఫోన్ వల్ల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, మహిళలు విధిగా గమనించాలని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐ ఓ సి సేఫ్టీ ఆఫీసర్ విన్ను, ఐ ఓ సి సేల్స్ ఆఫీసర్ మహేష్ లు మాట్లాడుతూ…. గ్యాస్ పై ఎంతో చక్కగా మహిళలకు అవగాహన కల్పించారు. అలాగే డొమెస్టిక్ గ్యాస్ మనకు 5 కేజీ లు, 10 కేజీ లు కూడా మనకు అందుబాటులోకి రాబోతున్నాయని వారన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి ఇంత మంది మహిళలు రావడం చాలా సంతోషంగా ఉందనీ పేర్కొన్నారు.
ఈ గ్యాస్ బండలు ఐరన్ అయితే పేలే ప్రమాదాలు ఉన్నాయి కనుక ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ తో తయారు చేసిన గ్యాస్ బండలు వస్తున్నాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి వై పి ఎం శ్యాంసుందర్, సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ డి వై పి ఎం సుదర్శన్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, టి బి జి కే ఎస్ కమిటీ మెంబర్ శంకర్రావు, సూపర్ బజార్ బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్, ప్రసాద్,
రవి, సిబ్బంది పాల్గొన్నారు.