ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలుంటే చర్యలు తీసుకోండి

2
– బిళ్లులు ఆపితే ఎలా?

– సీఎం వైఖరిపై మండిపడ్డ జానా

హైదరాబాద్‌,ఆగస్ట్‌8(జనంసాక్షి): ఇందిరమ్మ ఇళ్ల పధకంలో అవకతవకల పేరుతో బకాయిలు చెల్లించకుండా, ఇళ్లు నిర్మించకుండా ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని సిలె/-పీ నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై విపక్ష నేత జానారెడ్డి విమర్శలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు ఉంటే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. కాని ఆ పేరుతో పేదల ఇళ్ల బిల్లులు పెండింగులో ఉండడం ప్రభుత్వానికి తగదని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలుంటే బయట పెట్టాలన్నారు. ఇందిరమమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను ఎవరు పాల్పడిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణ జరిపించాలన్న ఆయన, అవకతవలకు పాల్పడ్డ వారు రాజకీయనాయకులైనా, ఉన్నాతాధికారులైనా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 లక్షల ఇళ్లు మంజారైతే అందులో 9 లక్షల ఇళ్లు మొదలు పెట్టలేదన్నారు. కేవలం 5 లక్షల ఇళ్లు మాత్రమే మొదలు పెట్టారన్నారు. వీటిలో కొన్ని ఇళ్లు నిర్మాణం పూర్‌ఖ్తెతే మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయన్నారు. ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజారు చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి గత ప్రభుత్వం రూ. 1000 కోట్ల కేటాయించిందన్నారు. ఆగిపోయిన వాటిని పూర్తి చేయకపోతే అటు ప్రభుత్వానికి, లభ్దిదారులకు నష్టమన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా చెప్పేదానికి,జరుగుతున్నదానికి పొసగడం లేదని అన్నారు. ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి వస్తోందన్న సంగతి గమనించాలని అన్నారు. ప్రభుత్వాన్ని క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి కాకుండా సచివాలయం నుంచి నడపాలని ఆయన సూచించారు. ప్రజలు కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి కోరారు. విపక్ష నేతలు కలవడానికి వెళితే వారికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సమస్యలపై చర్చించడానికి వచ్చిన వారిని అవమానించడం తగదన్నారు. అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకుండా, వచ్చిన కలవకుండా పాలన చేయడం నిరంకుశం తప్ప మరోటి కాదన్నారు.  మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని  జానా రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.