ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు

విజయూభవతో అమ్మవారికి ప్రత్యేక పూజలు
విజయవాడ,జనవరి22(జ‌నంసాక్షి):  వసంత పంచమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తుఉల పోటెత్తారు. మరోవైపే  ‘విజయీభవ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. సరస్వతిదేవి పుట్టినరోజు కావడంతో విద్యార్ధులకు ఆశీస్సులు అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వేదపండితులు తెలిపారు. రాష్టాన్న్రి  విద్యాంధప్రదేశ్‌ గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి తోడ్పాటు అందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు మహామండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తిని సరస్వతి దేవి రూపంలో అలంకరించడం విశేషం. ఈ సందర్బంగా విద్యార్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. విద్యార్ధులందరికి అమ్మవారి వద్ద ఉంచి పూజలు చేసిన పెన్ను, సరస్వతి కంకణం, సరస్వతి దేవి చిత్రపటాన్ని ప్రసాదంగా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా దుర్గగుడిలో విజయీభవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో  విద్యార్థుల కోసం ప్రత్యేక దర్శనానికి అనుమతినిచ్చారు. విద్యార్థులకు పెన్ను, పెన్సిల్‌ పంపిణీ చేశారు. పంచమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి రెండుగంటలకు పైగా సమయం పడుతుంది.

తాజావార్తలు