ఇంద్రవెల్లిలో బంద్
ఇంద్రవెల్లి: ఆదివాసుల ఆరాధ్యదైవం బేతాల్ దేవుడి జండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్
సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉట్నూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అచ్చేశ్వరరావు. ఎన్‌ఐ స్వామిలు బందోబస్తు ఏర్పాటు చేశారు.