.ఇక భారత్‌ స్టార్టప్‌ ఇండియా

2మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఢిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి) :వచ్చే ఏడాది జనవరి 16 నుంచి స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది చివరి మన్‌ కీ బాత్‌ లో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలకు క్రిస్‌ మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పర్యాటక ప్రదేశాల్లో అపరిశుభ్రత పేరుకుపోతుందని, స్వచ్ఛ భారత్‌ను పాటిస్తూ పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. దేశంలో గ్రామాలన్నింటినీ విద్యుదీకరించాలనే సంకల్పంతో తాము పని చేస్తున్నామన్నారు ప్రధాని. స్టార్టప్‌లను యువతకు, యూనివర్సిటీలకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. కాగా అతిథిదేవో భవ అని నమ్మే దేశం మనదని ప్రధాని మోదీ తెలిపారు. భారత దేశంలో బహుళ జీవవైవిద్యం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్నోసంస్కృతులు, సంప్రదాయాలకు భారత్‌ నిలయమని చెప్పారు. భారత్‌లో ఎన్నో పండుగలు నిర్వహించుకుంటామని రెండు రోజుల కిందటే క్రిస్మస్‌ అయిపోగా ఇప్పుడు కొత్త సంవంత్సర వేడుకలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ పలు అంశాలను పంచుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది పూర్తవనుండటంతో గత విషయాలను గుర్తుచేయడంతోపాటు వర్తమాన విషయాలను స్పృషిస్తూ, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలను సూచించారు. మన్‌ కీ బాత్‌ లో ఆయన ఏం మాట్లాడారంటే.. ఇది 2015లో ఆఖరి మన్‌ కీ బాత్‌ కార్యక్రమం. 2016లో తిరిగి మన్‌ కీ బాత్‌ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తొలి రోజునుంచి సహకరిస్తున్నవారందరికీ ధన్యవాదాలుఈసందర్భంగా మరోసారి క్రిస్మస్‌ శుభాకాంక్షలు.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా పరిశుభ్రత పాటించడం ద్వారా దేశ పర్యాటకం అభివృద్ధి చెందడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ ఖ్యాతి వెలుగొందుతుంది. అతిథిదేవో భవ అనే నమ్మే మనం వారిని మన ఇంటికి ఆహ్వానించడానికి ముందు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకుంటాం. మధ్యప్రదేశ్‌ లోని సిశోర్‌ జిల్లాలోగల భోజ్‌పురా గ్రామంలో శ్రీ దిలీప్‌ సింగ్‌ మాలవియా అనే సామాన్యుడు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇతరుల సహాయంతో 100 టాయిలెట్లు నిర్మించాడు. ఇది నన్ను ఎంతో ఆలోచింపజేసింది. బ్యాంకు గురించి ఏనాడు ఆలోచించని ఓ సామాన్య పౌరుడు నేడు బ్యాంకుకు వెళ్లి ముద్రా పథకం ద్వారా లోన్లు పొందుతున్నాడు. ప్రపంచం మొత్తాన్ని భారతీయ యోగా ఆకర్షించిందని ప్రతి భారతీయుడికి తెలిసిందే. ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నప్పుడు మనందరికీ భారతీయ శక్తిపట్ల మరింత విశ్వాసం లభిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 1000 రోజుల్లో ప్రతి గ్రామానికి విద్యుత్‌ ఇస్తామని ప్రమాణం చేశాము. దాని ప్రకారమే విద్యుత్‌ అందిస్తున్నాం. వారు ఆనందాన్ని పంచుకుంటుంటే వింటున్నాము. నరేంద్రమోదీ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవడం ద్వారా నాతో ప్రతిఒక్కరు కనెక్ట్‌ అయి ఉన్నారు. ప్రజల నుంచి గొప్ప ఆలోచనలను, విలువలను, తీసుకొని వాటిని ప్రమోట్‌ చేయాలి గత ఆగస్టు 15న స్టార్టప్‌ ఇండియా గురించి ప్రస్తావించాను. ఇది యువకులకు గొప్ప వరం కానుంది. జవనరి 16న స్టార్టప్‌ ఇండియా స్టాండప్‌ ఇండియాను ప్రారంభించనున్నాం. ఈ కార్యక్రమాన్ని అన్ని ఐఐటీలకు, ఐఐఎంలకు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు, ఎన్‌ఐటీలకు కనెక్ట్‌ చేస్తాం.1995 జనవరి 12 నుంచి స్వామి వివేకానందుడి జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సారి జరపబోయే దినోత్సవానికి యువకులు తమ ఐడియాలను తెలియజేయాలి. మన యువత టాలెంట్‌ ఏ ఒక్క ప్రాంతానికో కాకుండా మొత్తం దేశానికి వ్యాప్తించాలి. ఆ రకమైన అవకాశాలు మనం ఇవ్వాలి. ఈసారి ఛత్తీస్‌ గఢ్‌లో జరగబో యే జాతీయ యువజన దినోత్సవంలో 10 వేలమంది యువత పాల్గొనాలని కోరుతున్నాను. ఒక వ్యక్తి శరీరంలో లోపం ఉంటే మనం అంగవైకల్యం అని చెప్తాము. కానీ భగవంతుడి దృష్టిలో అది అదనపు సామర్థ్యం. ఈ సందర్భంగా యాక్సెస్‌బుల్‌ ఇండియా క్యాంపెయి న్‌ కు సహకరిస్తున్నవారం దరికీ ధన్యవాదాలు.నగదు బదిలీ పథకం గిన్నిస్‌ బుక్‌ లోకి ఎక్కి నందుకు గర్విస్తున్నానుగతంలో ఎన్నడూ లేని విధంగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ గురించి పార్లమెంటులో చాలా గొప్పగా చర్చించాం.మన దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు వారి విధులు నిర్వహిస్తే చరిత్ర లిఖించడం ఖాయం.