ఇక సర్కారీ చీప్ లిక్కర్
– గుబుంబాకు ప్రత్యామ్నాయం
– అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం
– ముఖ్యమంత్రి కేసీఆర్
అక్టోబరు 1నుంచి నూతన మద్యం విధానం: కేసీఆర్
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి):
తెలంగాణలో నూతన మద్యం విధానం అక్టోబరు 1నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ ప్రకటించారు. నూతన మద్యం విధానంపై సచి వాలయంలో అబ్కారీశాఖ మంత్రి పద్మారావు, ఆ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా సమీ క్షించారు. సమీక్ష ముగిసిన అనంతరం ఆయన మా ట్లాడుతూ… రాష్ట్రంలో తక్కువ ధరకే మద్యం ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజల ప్రాణా లను గుడుంబా హరించి వేస్తోందని.. దానిని అరి కట్టేందుకే తక్కువ
ధరకే మద్యం అమ్మాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుడుంబాను తరిమికొట్టాలన్న ఉద్దేశంతోనే నూతన మద్యం విధానం తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. గుడుంబా తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తక్కువ ధర మద్యం అమ్మకాలకు గ్రామీణ మండలం యూనిట్‌గా అనుమతులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తక్కువ ధరకు మద్యం తయారీ చేస్తామన్నారు. నూతన మద్యం విధానానికి ఆగస్టు 15 తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి.. అక్టోబరు 1నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు.