ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిఎం వైఎస్‌ జగన్‌

వాహనమిత్ర ప్రారంభోత్సవంలో మంత్రి పుష్ప శ్రీవాణీ
విజయనగరం,అక్టోబర్‌4  (జనంసాక్షి):  వైఎస్సార్‌ ప్రభుత్వం వచ్చాక అండగా ఉంటాను అన్న సిఎం జగన్‌ అన్న తన మాట నిలబెట్టుకున్నారని డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణీ అన్నారు. నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన 10,922 మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు వాహన మిత్ర కింద రూ.10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ..  బాషా మూవీలో హీరో చెప్పినట్టు ‘ నేను ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే ‘ అన్నట్టుగా జగన్‌ అన్న రియల్‌ హీరో కాబట్టి ఒక్క మాట ఇస్తే వందసార్లు నిలబెట్టుకుంటారని అభివర్ణించారు. కొవ్వూరు లో 2013 లో మా అమ్మా నాన్న తో కలిసి ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక ఆటో వ్యక్తి తమను ఆదుకున్నాడని, ఆటో డ్రైవర్లు గొప్ప సేవా తత్పరత కలిగిన వారని పొగిడారు. నిరుపేద ప్రజల కోసం నాణ్యత కలిగిన బియ్యం, వైద్యానికి ఆరోగ్య శ్రీ, పిల్లల చదువులు కోసం అమ్మ ఒడి, ఆడపిల్లల పెళ్లి కోసం వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద రూ.50 వేలు నుంచి లక్ష రూపాయలు అందిస్తోందని తెలిపారు. జిల్లాలో 28 వేల మంది ఆటో, టాక్షీ వాలాలు ఉండగా కేవలం 10 వేల మందికి వచ్చిందని, మిగిలిన వారు కూడా సమస్యలు అధిగమించి రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. మ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, సంబంగి చిన్న వెంకట అప్పలనాయుడు, కొండపల్లి అప్పల నాయుడు, ఎమ్మెల్సీ రఘు వర్మలు మాట్లాడుతూ.. ఈ దేశంలో..రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని పాలన జగన్మోహన్‌ రెడ్డి చేసి చూపిస్తున్నారన్నారు. పాలన ప్రజల వద్దకు తెచ్చేలా సచివాలయం వ్యవస్థ తీసుకు వచ్చారన్నారు. పాలకులే కాదు అధికారులు కూడా సక్రమంగా పని చేస్తేనే మంచి పాలన సాధ్యమని, అవినీతి రహిత పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.  పార్టీలకి అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. వార్డుల్లో తిరిగి అనేక సమస్యలను గుర్తించి..ప్రజా అవసరాలను గుర్తించి మంత్రి బత్స సత్యనారాయణ చేతుల విూదుగా శత శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. తాగు నీటి కి ఇబ్బంది లేకుండా వర్షాలు కురిసేందుకు కలెక్టర్‌ మొక్కలు నాటుతూ..మొక్కల కలెక్టర్‌ గా పేరొందారని ప్రశంసించారు. విజయనగరం ఏర్పడి 40 ఏళ్ళు అయినా ఇంకా కొందరు తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని, ఆ స్థితిలో నిరుద్యుగులు ఆటోలు వేసుకొని జీవిస్తున్నారని, వారిపై పోలీసులు లేనిపోని కేస్‌ లు పెట్టకూడదని మనవి చేశారు. వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వాలని, వారిలో మార్పు తీసుకురావాలని సూచించారు. చదువుకొని కూడా
ఉపాధి లేక కూలీ పనులకు వెళుతున్న వారి పిల్లలకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్‌ తో మంచి చదువులు చదివించారని చెప్పారు. జగన్‌ సీఎం అయ్యాక వారికి నాలుగున్నర లక్షల ఉద్యోగుల ఇచ్చి పేద వాళ్ళ కళ్ళలో సంతోషం నింపారని పేర్కొన్నారు. ఎంపీ బెల్లన్న చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 30 వరకు ఈ రూ.10 వేలు వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం పొగిడింపు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పొగిడింపు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరైనా ఇప్పటికీ పథకాన్ని అనివార్య కారణాల వల్ల నమోదు చేయించుకోని పక్షంలో ఆటో, మెక్సి క్యాబ్‌ డ్రైవర్స్‌ ఈ లోపు ఆఫ్‌ లైన్‌, ఆ/-లనైన్‌ లో నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌ లాల్‌ మాట్లాడుతూ.. పేద, కార్మిక వర్గం, నిరుపేదలు ఇబ్బందుల పైనే ప్రభుత్వం ఎక్కువ దఅష్టి పెడుతోందన్నారు. మిగిలిన జిల్లాల కంటే విజయనగరం జిల్లా ఈ పథకాన్ని పొందుకోవడంలో ముందుందని తెలిపారు.