ఇతరులకు సహాయం చేయడంలోనే సంతృప్తి

కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): పేదలకు తమ వంతు సహాయం చేయాలనే లయన్స్ క్లబ్ ఆశయానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ , స్థానిక 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు.శనివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వారి ఆధ్వర్యంలో రోగులు , రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి తనవంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పట్టణంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సహాయం చేస్తున్నట్లు చెప్పారు.తోటివారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆత్మ సంతృప్తి ఉందన్నారు.పూర్వ కాలం నుండి మన పెద్దలు మనకు ఇదే విషయం భోధించారని అన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి పేద ప్రజలకు మెరుగైన సేవలు అందుతుండటంతో రోగుల సంఖ్య పెరిగిందని, ఈ నేపథ్యంలో ఉదయం అందించే అల్పాహారం రోగులకు అండగా ఉంటుందన్నారు.కరోనా సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి నిరంతరం పర్యవేక్షణ చేసి జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చేశారని,వందలాది మంది కరోనా బాధితులు ప్రాణాలు నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ చంద్ర , ఆర్సీ చిలుముల శ్రీనివాస రెడ్డి , జెడ్సీ మర్రు హనుమంత రావు, సెక్రటరీ యాదా కిరణ్, ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్ , రఫీ , బజ్జూరి శ్రీనివాస్ , జూలకంటి నాగరాజు, తెరటపల్లి సతీష్ , కుక్కడపు భిక్షం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.