ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కెసిఆర్ పథకాలు
ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య
జనగామ,ఫిబ్రవరి14(జనంసాక్షి): సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. రైతుబంధు పథకాన్ని ఇటీవల కేంద్రం కూడా ప్రకటించిందని, కల్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయని చెప్పారు. పక్కనున్న ఎపిలో కూడా మన పథకాలను కాపీకొట్టి అమలు చేస్తున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలా నిలిచాయని, పేద తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నాయని అన్నారు. ఎన్నికల హావిూలో లేకున్నా కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేశారని, మూడున్నరేళ్లుగా పేదలు, బడుగులకు చెందిన ఆడబిడ్డలకు వివాహ సమయంలో ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందని గుర్తు చేశారు.