ఇది సీమాంధ్ర మహిళా కమిషన్: తుల ఉమ
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర మహిళా కమిషనను పునరుద్దరించి తెలంగాణకు సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమ అన్నారు. ఇవాళ ఆమె విలేకరులతో మాట్లాడారు. నిన్న ప్రభుత్వం నియమించిన మహిళా కమిషన్‌లో ఒక్క తెలంగాణ మహిళ కూడా లేదని ఆమె మండిపడ్డారు. కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యేందుకు కాంగ్రెస్ ఒక్క తెలంగాణ మహిళకు కూడా అర్హత లేదా, సీఎం కిరణ్‌కు ఒక్క తెలంగాణ మహిళ కూడా కనిపంచలేదా అని నిలదీశారు. తెలంగాణ ఒక్క పైసా కూడా ఇవ్వనన్న సీఎం కిరణ్ ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.