ఇదేమి కాపురం “కల్తీ కాపురం” !!! (పార్టు…1)

ఎదిరించే
భార్య ప్రక్కన
ఏ భర్తా ప్రశాంతంగా
నిదురించలేడు అతడు
“అర్థనారీశ్వరుడైతే తప్ప”
బెదిరించే
భర్త‌ ప్రక్కన
ఏ భార్యా నిశ్చింతగా
నిదురించలేదు ఆమె
“అపర కాళికామాతైతే తప్ప”
పెళ్ళికి ముందు
వారిద్దరు “ప్రేమపక్షులు”
పెళ్ళి తర్వాత
చిరునవ్వుల”చిలకా గోరింకలు”
నేడు
“ప్రేమలు”
తరిగిపోయి…
కన్న కమ్మని
“కలలు” కరిగిపోయి…
అనుమానాలు
“అపార్థాలు” పెరిగిపోయి…
ఆ ఇద్దరు బద్ధశత్రువులై
“పిల్లీ ఎలుకలై…పాము కప్పలై”
నిత్యం కాపురం ఒక “నిప్పులకుంపటై…
ఇద్దరికీ “మనశ్శాంతి” కరువై
మానసికంగా ఒకరికొకరు దూరమై
నిన్నటి ఆ బిగికౌగిలి నేడు”విషకౌగిలియై”
నిన్నటి “పండువెన్నెలలు కురిసిన ఆ పడకగది”
నేడు పగాప్రతీకారాలు తీర్చుకునే “రచ్చబండయై”
రాత్రింబవళ్లు  ….
రాస క్రీడ‌యై
రాక్షస యుద్ధమై…
రంపపు కోతయై….
బ్రతుకు రావణకాష్టమై రగిలి పోతోంది…(సశేషం)
రచన:
“కవి రత్న”
“సహస్ర కవి”
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి…9110784502