ఇద్దరు దొంగల అరెస్ట్.. 37 తులాలబంగారు అబరణాలు.11వేలఐదు వందల స్వాధీనం.
ఎస్పీ రాహుల్ హెగ్డే.
సీసీ కెమెరాల ఆధారంగా చోరీ కేసు చేదించిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల. బ్యూరో సెప్టెంబర్ 3.(జనం సాక్షి).. సీసీ కెమెరాల ఆధారంగా పరిశోధన చేసిన పోలీసులు చోరీ కేసును చేదించారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసి 37 తులాల బంగారు ఆభరణాలతో పాటు నగదు వెండి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం మీడియా సమావేశంలో వివరాలను తెలిపారు. వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ లో ఆగస్టు 14న రాత్రి తాళాలు పగలగొట్టి ఏనుగుల మనోహర్ రెడ్డి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ విషయంలో బాధితుల పిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేదించారు. మంచిర్యాల జిల్లా బద్వాన్నపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి దనలక్ష్మి ,తాళ్లపల్లి ప్రసాద్ భార్యాభర్తలు కలిసి చోరీకి పాల్పడ్డట్టు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. శనివారం బద్వానపల్లిలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుండి ఉప్పుగడ్డలో అపహరించకపోయిన 31.8 తులాల బంగారం, 32.5 తులాల వెండి 11వేల 5 వందల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తలు గతంలో రుద్రవరం గ్రామంలో చోరీ చేయడంతో పాటు అనేక కేసుల్లో ఉన్నారని అన్నారు. తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చాకచక్యంగా కేసును చేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పి చంద్రయ్య, వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్, ఎస్సై రమేష్, పోలీస్ కానిస్టేబుల్ రాజేందర్, సునీత పాల్గొన్నారు.