ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెరువురాపల్లి తండాలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జ్యోతి (28) అనే వివాహిత తనతో పాటు బిడ్డలు అనిల్ (4), సునీల్ (2) సునీత (6నెలలు)కు విషం తాగించి ఆత్మహత్యకు పాల్పడింది. వీరిలో జ్యోతితో పాటు అనిల్, సునీల్ అక్కడికక్కడే మృతిచెందారు. సునీత కోనప్రాణాలతో ఉండటంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే పిల్లలతో సహా జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.