ఇద్దరు రైతుల ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని చల్ గల్ లో నాగయ్య అనే రైతు పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగయ్య పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. కాగా మండలంలోని గాలెపల్లిలో మరో రైతు బేపి సుధాకర్ రెడ్డి అప్పుల బాధతో తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.