ఇద్దరు వైద్యులకు తాకీదులు
ఇంద్రవెల్లి: మండలంలోని పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులకు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్ ఛార్జీ మెమోలు జారీ చేశారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులకు గైర్హాజరైన వైద్యులకు తాకీదులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి అల్లం రవి పాల్గొన్నారు.