ఇబ్రహీంపూర్‌ దేశానికే తలమానికం

4 copy

– గవర్నర్‌ ప్రశంసలజల్లు

మెదక్‌,జులై 15(జనంసాక్షి): మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పాల్గొని మొక్క నాటారు. ఇబ్రహీంపూర్‌లో లక్షా 5 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి గవర్నర్‌  శ్రీకారం చుట్టారు. జమ్మి మొక్కనునాటిన గవర్నర్‌ అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి వాటి సంరక్షణను తీసుకోవాలని అన్నారు. మొక్కలు లేకుంటే మనకు జీవితం లేదని, ప్రకృతిని విస్మరిస్తే వినాశనం తప్పదన్నారు. మొక్కలను పెంచితేనే వర్షాలకు అవకాశం ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏదీ చేపట్టలేమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం ముందుకు సాగుతోందన్నారు. ప్రజలు ముందుకు సవ్తేపనే ఇది సాధ్యమన్నారు. గ్రామ ప్రజలు ఎంతోఉత్సాహంగా ముందుకు రావడం ఆనంద దాయకమన్నారు. గ్రామంలో సోలార్‌ పవర్‌కు సహకరిస్తామని అన్నారు. ఈ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శం కానుందన్నారు. అసెంబ్లీలో తీర్మానం ద్వారా ప్రతి ఒక ఎమ్మెల్యే ఓ ఆదర్శ గ్రామాన్ని తయారు చేసుకోవచ్చన్నారు. తాము హైదరాబాద్‌లో ఉండి ఇక్కడి మంచి పనులను ఆదర్శంగా తీసుకుంటామని అన్నారు. వాననీటి సంరక్షణ తప్పని సరికావాలన్నరు. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లో చెప్పాన్నారు.

కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఉప సభాపతి పద్మా దేవేందర్‌ రెడ్డిలు పాల్గొన్నారు. గ్రామంలో కలియతిరిగిన గవర్నర్‌ బాలవికాస వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. అదేవిధంగా కూరగాయల పంటలను పరిశీలించి ఆదాయ వ్యయాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఇక్కడి రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. ఇంకుడు గుంతలను, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులను గవర్నర్‌ పరిశీలించారు. ప్రజలు పట్టుబడితే సాధ్యం కానిదేవిూ లేదని ఇబ్రహింపూర్‌ నిరూపించిందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. వందశాతం ఇప్పడుఉ మరుగుదొడ్లు నిర్మించారని, ఇంకుడు గుంతలు తవ్వుకున్నారని అన్నారు. లక్షా ఐదువేల మొక్కలు నాటిని ఘనత గ్రామానిదన్నారు. గవర్నర్‌ రావడంతో మరింత ఉత్సాహం వచ్చిందన్నారు. అలాగే మరో లక్షాఐదువేల మొక్కలను అదనంగా నాటామన్నారు. కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి కూడా పాల్గొన్నారు.