ఇరుకు గదుల్లో గ్రామ పరిపాలన..

పాతవి శిథిలం,కొత్తవి ఇరుకు గదుల్లో కొనసాగింపు                                             * నిర్మాణం చేపట్టినవి అసంపూర్తి             * ఇబ్బందులు పడుతున్న పాలకవర్గం         సభ్యులు,సిబ్బంది
జనం సాక్షి  /కొల్చారం ప్రజా పాలన గ్రామస్థాయి నుండి మొదలవుతుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరిగినదే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీలు పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించగా ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకొన్నాయి.  గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.ఉన్న రెండు గదులు కూడా పెరిగిన పరిపాలన విభాగాలతో ఇరుకు గదుల్లో కూర్చునేందుకు వీలులేకుండా తయారయ్యాయి.మరోవైపు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక పోవడం చిన్న పాటి అద్దె భవనాల్లో  కొనసాగుతుండగా, నధులు మంజూరు అయిన భవనాలు అసంపూర్తి దశలో దర్శనమిస్తున్నాయి.ఇది కొల్చారం మండల  గ్రామ పంచాయతీల తీరు.                          * మండలం లో గ్రామ పంచాయతీలు….        — కొల్చారం మండలం లో ఐదేళ్ల క్రితం మొత్తం16 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 వేల జనాభా కలిగిన గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు.            — జనాభా ప్రాతిపదికన 5 నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటయ్యాయి.            — నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడం పాలక వర్గాలు కూడా కొలువుదీరి మూడేళ్ల అవుతుంది.                                 * గ్రామపంచాయతీలో దుస్థితి……             —- మండలంలో ఇదివరకే ఉన్న 16 గ్రామ పంచాయతీల భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది.            — వీటిలో నూతనం గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం కొంగోడ్, పోతంశెట్టి పల్లి,చిన్న ఘనపూర్,కోనాపూర్ గ్రామాలకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద 2016 లో రూ.13 లక్షలు కేటాయిస్తూ శంకుస్థాపన పనులు చేశారు.                     — కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో కొంగోడు,పోతంశెట్టి పల్లి చిన్న ఘనపూర్ గ్రామాల్లోని నిర్మాణాలు పూర్తి స్థాయిలో కాకపోవడం అరకొర వసతులతో అందులోనే పరిపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.                 — కోనాపూర్ లో మాత్రం అప్పటి సర్పంచ్ ఎలాగోలా సొంత నిధులతో నిర్మాణాన్ని పూర్తి చేశారు.పైతర గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం స్థలం వివాదంతో శిలాఫలకం స్థాయిలోనే నిలిచిపోయింది.     — ఇటు కొత్తగా ఏర్పాటు అయిన 5 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఇప్పటికీ చర్యలు చేపట్టకపోవడం చిన్నపాటి గదుల్లో,పాఠశాలల ఆవరణలోని అదనపు గదుల్లో నిర్వహిస్తూ వస్తున్నారు.                  * ఇవి ఇబ్బందులు…..                                 — ప్రతి గ్రామపంచాయతీలో పరిపాలన విభాగం సిబ్బందితో పాటు పాలకవర్గం ఏ సమావేశాలు నిర్వహించాలన్నారు గదులు సరిపోకపోవడం ఆరుబయటనే సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.         — కొన్ని గ్రామ పంచాయతీల్లో నైతే సమావేశాలు నిర్వహించినపుడు పరిపాలన సిబ్బంది,పాలకవర్గం సభ్యులు ఆరు బయట నిల్చుoడవలసిన దుస్థితి కనిపిస్తుంది                                               —కొత్తగా ఏర్పాటు అయిన గ్రామపంచాయతీల్లో నైతే గదుల కొరత కారణంగా కనీసం ఒక టేబుల్,కుర్చీ వేసుకునే పరిస్థితి లేకపోవడం,రికార్డులు భద్రపరచుకోవాలన్న ఇబ్బందులు పడక తప్పడం లేదు.                                           — కొత్త గ్రామపంచాయతీ లో మౌలిక వసతులు లేకపోవడం,ఎక్కువ మహిళ పంచాయతీ కార్యదర్శులు ఉండడం వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.               — ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలు నీకు అన్ని హంగులతో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నా నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై అన్ని వర్గాలకు చెందిన ప్రజలు,ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.          *పూర్తి శిథిలావస్థకు చేరుకుంది: ఇతర గ్రామ పంచాయతీ భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. పై నుండి పెచ్చులూడి పడుతున్నాయి. ఉన్న రెండు గదులు ఏ మాత్రం సరిపోవడం లేదునూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన స్థలం సేకరణలో  ఇబ్బందుల కారణంగా శిలాఫలకం వేసి వదిలివేశారు.                          —- సంతోష,సర్పంచ్, పైతర                 * ఒకే గదిలో నిర్వహణ కష్టంగా ఉంది: నూతనంగా ఏర్పాటు నేను మా గ్రామ పంచాయతీ ఓకే గది మాత్రమే ఉంది. గ్రామంలో అద్దెకు తీసుకున్న మన్న అనువైన గదులు దొరకడం లేదు.మౌలిక వసతులు లేకపోవడం ఇబ్బంది కరంగా తయారయింది.ఉన్న ఒక గదిలో సామాగ్రి పెట్టడం తప్పించి,సమావేశాలన్ని ఆరుబయటే నిర్వహిస్తున్నాం.                         —- మాధవి,సర్పంచ్,తుక్కాపూర్           * నూతనంగా ఏర్పాటు అయిన వాటికి ప్రతిపాదనలు పంపాం:                                 మండలంలో నూతనంగా ఏర్పాటైన ఐదు గ్రామపంచాయతీల నూతన భవన నిర్మాణాల కోసం ఒక్కోదానికి రూ.20 లక్షలు ప్రతిపాదిస్తూ ప్రతిపాదనలు పంపించడం జరిగింది.మిగతా పాత గ్రామపంచాయతీల నూతన భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదించాo.                        —- ఇర్ఫాన్,పంచాయతీరాజ్ ఏఈ, కొల్చారం