ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
రాజన్న సిరిసిల్ల,అక్టోబర్26(జనంసాక్షి): ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పరస్పరం కర్రలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు వర్గాల దాడిలో 8 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలోనే ఇరు వర్గాల మధ్య దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రామోజీపేటలో పోలీసులు మోహరించారు.