ఇరు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు భేష్
– సమస్యలు లేవు
– రాజ్‌నాథ్‌తో నరసింహన్ భేటి
న్యూఢిల్లీ,ఆగస్ట్8(జనంసాక్షి):తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు త్వరలోనే
పరిష్కారం అవుతాయని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన గవర్నర్ శనివారం కేంద్ర ¬ంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం గవర్నర్ నరిసింహన్ విూడియాతో మాట్లాడుతూ… జాతీయ, రాష్ట్ర విషయాలపై సమావేశంలో చర్చించామన్నారు. ఉద్యోగుల విభజన అంశాన్ని కేంద్రం చూసుకుంటుందన్నారు. రాష్ట్రాల మధ్య వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు లేవని నరసింహన్ తెలిపారు. విూడియానే ఈ సమస్యలను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని గవర్నర్ చెప్పారు. రాజ్‌నాథ్‌తో హైకోర్టు, ఉమ్మడి సంస్థలు, ఉద్యోగుల పంపకాలు, హెడ్యూల్ 9, 10 అంశాలు, విజయడైరీ, శాంతి భద్రతలు, సెక్షన్ 8 వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై గవర్నర్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నీటి పంపకాల విషయంపై రాజ్ నాథ్ సింగ్ ఆరా తీసినట్లు సమాచారం. దాదాపు 20 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. అంతకముందు… గవర్నర్ ¬ంశాఖ సెక్రటరీ గోయెల్ తో 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఇదిలావుంటే ఢిల్లీ పర్యటనలో గవర్నర్ బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ¬ంశాఖ కార్యదర్శితో గవర్నర్ సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లోని తాజాపరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కూడా గవర్నర్ సమావేశం కానున్నారు. ఇదిలావుంటే దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపిరగ్ వ్యవహారంపైనా గవర్నర్ నివేదిక సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఆయన సొంతంగా నివేదిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్యాపింగ్‌పై తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని, ఆందోళనను కూడా వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపిరగ్ చేస్తోందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేసుకురటోంది. గవర్నర్ నివేదిక ఇస్తున్న సమయంలోనే ఎపి అధికారులు కూడా కేంద్రానికి ట్యాపింగ్‌పై వివరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెరడు రోజుల్లో కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సిఎం చంద్రబాబు ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. పెద్ద సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, కేవలం అది కట్టుకథ మాత్రమేనని ఆ రాష్ట్ర అధికారులు అరటున్నారు. అయితే హైకోర్టులో వ్యవహారం రావడంతో ట్యాపింగ్ నిజమేనని తేలిందని ఎపి ప్రభుత్వం వాదిస్తోంది. మొత్తం విూద తాజా ఫోన్ ట్యాపిరగ్ వ్యవహారం రెరడు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి కారణమవుతురడగా, గవర్నర్ ద్వారా వివాదం ఢిల్లీకి చేరుకుందని సమాచారం.