ఇళయారాజా,విజయేంద్రప్రసాద్‌లకు శుభాకాంక్షల వెల్లువ


అభినందనలు తెలిపిన రజనీకాంత్‌,మెగాస్టార్‌
రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా , బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ విూడియాలో పోస్ట్‌ పెట్టారు. ఇప్పుడు మన లెజండరీ హీరో మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతాలో ఇళయరాజాకు, విజయేంద్ర ప్రసాద్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వేరు వేరుగా పోస్టులు పెట్టారు. అలాగే, భారత ప్రధాని నరేంద మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలిపారు. కేందప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో మొత్తం నలుగురిని రాజ్యసభకు నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి వరుస ట్వీట్స్‌ చేసి అటు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు..ఇటు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అసమానమైన సంగీత మేధావి ఇళయరాజాకి హృదయ పూర్వక అభినందనలు. రాజ్యసభలో విూరు అడుగుపెట్టిన తర్వాత ఎగువ సభలో మేదావి వర్గాల్లో ఒకరిగా ఖచ్చితంగా గుర్తింపు సాధిస్తారు. విూలాంటి గొప్ప వ్యక్తి నా సినిమాలకు సంగీతాన్ని అందించడం సంతోషంగా అనిపిస్తోంది’..అని ఇళయరాజాకు విషెస్‌ చెప్పారు. ఇదే క్రమంలో.. ’భారతీయ చలనచిత్ర పరిశ్రమలో
అత్యంత నిష్ణాతులు, అద్భుతమైన కథా రచయితలలో ఒకరైన కె.వి.విజయేంద్ర ప్రసాద్‌ రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ అయినందుకు హృదయపూర్వక అభినందనలు. విూ ఉనికి మన ఎగువ సభ కీర్తిని పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు’..అంటూ శుభాకాంక్షలు తెలిపారు.