ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ బోల్తా-డ్రైవర్
నెల్లూరు: ఇసుక అక్రమరవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం బొంతలపాలెం వద్ద ఇసుక అక్రమ రవాణాను గనుల శాఖ అధికారులు ఈ ఉదయం గుర్తించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను వెంబడించారు. దీంతో అధికారుల నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ వేగంగా నడపటంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.