ఇసుక కొరత తీర్చాలి

ఏలూరు,నవంబర్‌8 (జనం సాక్షి) : ఇసుక చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చి భనవ నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.లింగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  గత ఐదు నెలలుగా ఇసుక కొరతతో పనులు లేకుండా లక్షాలది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానం వల్ల ఇసుక బంగారంగా మారిందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల పనులు కోల్పోయిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి రూ.10 వేల నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇసుక వారోత్సవాల లోపు సమస్య పరిష్కరించకుంటే అన్ని సంఘాలను కలుపుకుని అవసరమైతే రాష్ట్ర బంద్‌ కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.