ఈజిప్ట్‌లో కొనసాగుతున్న ఘర్షణలు

కైరో: కైరో అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ అధికారలను గుప్పిట్లో పెట్టుకుంటూ తాజా డిక్రీని ప్రకటించిన అనంతరం ఈజిప్ట్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మోర్సీ వ్యతిరేకులు, మద్దతుదారుల మధ్య ఘర్షణలు, ప్రదర్శనలు, ఆందోళనలతో దేశం అట్టుడుకుతుంది. ఈ నేపథ్యంలోనే కైరోలో అధ్యక్ష భవనం ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడ సైన్యాన్ని, ట్యాంక్‌లను కూడా మోహరించారు. తాజాగా జరిగిన ఘర్షణల్లో 300మంది. గాయపడ్డారు. అధ్యక్ష భవనం వెలుపల రెండు రోజులుగా ఈ రెండు వర్గాల మద్య ఘర్షణలు కొనసాగుతున్నాయని జాతీయ టెలివిజన్‌ సమాచారం  తెలిపింది.  మోర్సీడిక్రీని వ్యతిరేకిస్తూ 300మంది ప్రతిపక్ష కార్యకర్తలు అధ్యక్ష భవనం ప్రాంత అంతా టెంట్లు వేసి ఆందోళనకు దిగిన అనంతరం మోర్సీ మద్దతుదార్లు ఈ ప్త్రాంలోకి రావటంతో రెండు వర్గాల మద్య ఘర్షనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం నుంచి నిరసన కారులను పంపించేందుకు బలప్రదర్శనకు దిగుతున్నారు.  ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.  కొత్తరాజ్యాంగంపై దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదిన జరగనున్న రెఫరెండంను కూడా ప్రతిపక్ష గ్రూపులు వ్యతిరేఖిస్తూన్నాయి. రెఫరెండం జరిగి తీరుతుందని ఉపాధ్యక్షుడు మహ్మద్‌ మెక్కి ప్రకటించారు. ఇక్కడి పరిస్థితులు మరింత విషమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదకర పరిణామాలకు దారితీయ వచ్చేనని మీడియా పేర్కొంది. మోర్సీ పార్టీ వ్యవహారం మాజీ అధ్యక్షుడు హూస్నీ ముబారక్‌ వ్యూహాలను గుర్తు చేస్తున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.