ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే

సిరిసిల్ల: కేసీఆర్, కేటీఆర్‌తో అధికారం, పంపకాల్లో ఏం తేడా జరిగిందో తెలియకపోయినా ఈటల రాజేందర్ మాట్లాడింది చూస్తే లావా ఉప్పొంగినట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. శుక్రవారం కొదురుపాకలో జరిగిన మిడ్‌మానేరు నిర్వాసితుల నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే, కేటీఆర్ ఫోన్‌తో ఆయన తుస్సుమన్నాడని ఎద్దేవా చేశారు. తుస్సుమనడమేనా నీ సంస్కృతి..? కరీంనగర్ బిడ్డల పౌరుషమిదేనా అని నిలదీశారు.