ఈటెల పరుష పదజాలం దారుణం


దిష్టిమొమ్మ దగ్ధం చేసిన గొల్లకురుమలు
హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): ఈటల రాజేందర్‌ ఉపయోగిస్తున్న పరుష పదజాలంపై టీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బానిస అని వ్యాఖ్యానించిన ఈటల దిష్టిబొమ్మను ఇల్లంతకుంట మండల గొల్లకురుమలు దహనం చేశారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించడంతో తాను ఓడిపోతానని భావించి, ఆ ప్రకటనను జీర్ణించుకోలేక పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని గొల్లకురుమలు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌, నన్నేబోయిన రవియాదవ్‌, మల్లేష్‌ యాదవ్‌, ఏనుగుల రాజకొమురయ్య, మ్యాకల మల్లయ్య, గట్టయ్య, రాజేష్‌, గణెళిష్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.