ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా బైంసా పట్టణంలోని ఒవైసీ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌(12), ముజమిల్‌ ఖురేషీ(9) స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థులు సరదాగా పట్టణ శివారులోని నీటి గుంటల వద్ద ఈతకు వెళ్లారు. రాత్రి వరకు విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో గాలించగా… నీటిగుంట వద్ద దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.