ఈదాహం తీరనిది!

(కరీంనగర్‌, టీ మీడియా) జిల్లాలో ఈవేసవిలో గత ఏడాది కంటే తాగునీటి సమస్య తీవ్రమైంది. మెట్టవూపాంతాలు, పట్టణాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజావూపతినిధుల సూచనలను తీసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి డీ శ్రీధర్‌బాబు బుధవారం మధ్యాహ్నం ఆర్‌డబ్లూఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు కలెక్టర్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. మంగళవారం జరిగిన విజిపూన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఎన్‌ఆర్‌డీడబ్లూపీ పథకం ద్వారా తాగునీటి పథకాల పురోగతిపై ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. నేటి సమావేశంలో ఆర్‌డబ్ల్యూ ఎస్‌ పథకాలు, ఈపథకాలకు విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ బకాయిలపై ప్రశ్నించే అవకాశాలున్నాయి. వివిధ గ్రామాల్లో పూర్తైన ఆర్‌డబ్లూఎస్‌ పథకాలకు కరెంటు కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ పథకాలకు 24గంటల పాటు విద్యుత్‌ను అందించాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. ట్రాన్స్‌కోకు బాకీపడ్డ ఆరున్న రకోట్లు ఇంకా విడుదల కాలేదు.

వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. జిల్లాలోని 864 హాబి సమస్యను అధిగమించేందుకు రూ. 7నుంచి 15కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించింది. 225 వాహనాలతో రవాణా ద్వారా తాగునీటి సరఫరాకోసం రూ.3కోట్ల 65లక్షల 50వేలు, ప్రైవేటు సోర్సు ద్వారా 572 హాబి రూ. 1కోటి 1లక్ష ఖర్చు కానున్నట్లు అంచనావేశారు. 1179 బోర్‌ల్స్‌ పూడిక తీతకోసం రూ. 60.54 లక్షలు, 127 బోరు బావులను మరింత లోతు తవ్వటం కోసం 36.28లక్షలు , 151ఓపెన్‌ తవ్వకాల పూడికతతీత, తవ్వకాలకోసం రూ. 1కోటి 51లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం కేవలం రూ. 3కోట్ల మాత్రమే కేటాయించింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కింద తాగునీటి సమస్యను అదిగమించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ క్రింద ప్రభుత్వం ఆశాఖను ప్రతిపాదనలు కోరగా , 57 ఎస్సీ గ్రామాలకు తాగునీటి అవసారాలకోసం రూ. 5.119 ఎస్టీ గ్రామాలకు 12.66 కోట్లతో ప్రతిపాదనలను పంపించినట్లు ఎస్‌ ఈ హరిబాబు ‘టీ మీడియా’కు తెలిపారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్లూపీ) కింద జిల్లాలో 313 పాఠశాలల్లో తాగునీటి కోసం రూ. 2.81కోట్ల 5 లక్షలు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. ఇదే పథకం కింద జిల్లాలోని 250 అంగన్‌వాడీ పాఠశాలలకు తాగునీరు అందించేందుకు రూ. 1కోటి 87లక్షల 50 వేలు విడుదలయ్యాయి. ఆర్‌డబ్లూఎస్‌ ద్వారా రూ. 12కోట్లతో చేపట్టిన తిమ్మాపూర్‌, బెజ్జంకి, రూ.15కోట్లతో చేపట్టిన హుస్నాబాద్‌ తాగునీటి పథకాలు పూర్తి దశకు చేరుకున్నామే నాటికి తాగునీరు అందిస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఈ మూడు పథకాలు ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంటాయి. రాజీవ్హ్రదారి విస్తరణ సమయంలో తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణాపూర్‌ కాలనీ వరకు మూడుకిలోమీటర్ల మేర పైపులైన్‌ దెబ్బతింది. రాజీవ్హ్రదారి రోడ్డు నిర్మాణం సందర్భంగా వివిధ శాఖలకు రూ. 56కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. తాగునీటి పైపులైన్లు దెబ్బతినడం ద్వారా రూ. కోటి 50లక్షల నష్టం వాటిల్లింది. వీటి నిర్మాణానికి నిధుల మంజూరుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.