ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సవానికి కూలిన విద్యుత్‌టవర్
కమాన్‌పూర్, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి చేతికందే సమయంలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. గుండారం శివారులోని మామిడితోటల్లో కాయలు నేలపాలయ్యాయి. రామగుండం సబ్‌స్టేషన్ నుంచి వరంగల్ జిల్లా చిట్యాలకు వెళ్లే 132 కేవీ విద్యుత్ టవర్ గుండారం శివారులో కూలిపోయింది. పేరపల్లిలో రెండు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలని పలువురు రైతులు కోరారు.